- Advertisement -
సర్పంచ్ కుమారుడు దత్తు
నవతెలంగాణ – మద్నూర్
గ్రామ శుభ్రతలో మీ పాత్రే కీలకం అని అంతాపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు దత్తు పటేల్ అన్నారు. మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు ఆ పంచాయతీ వార్డు సభ్యులైన గంగారం పటేల్ కర్మేల్కర్ మారుతి నివర్తి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి బాయి కుమారుడైన దత్తు పటేల్ మాట్లాడుతూ.. గ్రామం శుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులే కీలకమని అన్నారు. వార్డు సభ్యుల సన్మానంతో పారిశుద్ధ్య కార్మికులు, వార్డు సభ్యులకు సర్పంచ్ కుమారుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



