రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన లక్ష్మణ్ (22) తాగుడికి బానిసై తన ఇంట్లో ఎర్ర రంగు చీర తో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాలని రెంజల్ ఎస్ఐ ఈ. సాయన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నీల గ్రామానికి చెందిన ఎల్ చిన్న సాయిలు కుమారుడు లక్ష్మణ్ తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి తో ఫ్యానుకు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.