Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఘనంగా యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

ఘనంగా యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్ నాయక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పాలకుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ల ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ జెండాను యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్ ఆవిష్కరించారు. కేంద్రంలోని బిజెపి నిరంకుశ పాలనను వ్యతిరేకించేందుకు యువత నడుం బిగించాలని, భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని పిలుపునిచ్చారు. యువత కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటిదని అన్నారు.

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాదాసు హరీష్ గౌడ్, దేవరుప్పుల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న, పెద్దవంగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరికృష్ణ, కొడకండ్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యాకేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కమ్మగాని శ్రావణ్, శ్రీధర్,అశోక్, పులి వేణు, మధు, భాస్కర్, రవి, హరి చందర్, మహేందర్, వెంకన్న, లోడంగి అశోక్, వినోద్, సురేష్, రాజేష్, బాలెంల ఉమేష్, సంతోష్, సాయి, శిరీష్, కృష్ణ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img