Saturday, September 27, 2025
E-PAPER
Homeఖమ్మంయువత నైతికత, సాంకేతికతతో దేశాభివృద్ధికి తోడ్పడాలి..

యువత నైతికత, సాంకేతికతతో దేశాభివృద్ధికి తోడ్పడాలి..

- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే జారె పిలుపు…
నవతెలంగాణ – అశ్వారావుపేట

నేటి యువతరం నైతికత, విలువలతో కూడిన శ్రమ, సాంకేతికతతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఆయన అశ్వారావుపేట లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన యువతను ఉద్దేశించి మాట్లాడారు.

నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం నాటి అనేక  త్యాగధనుల పోరాట ఫలితమే నన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల కలలు కన్న  భారత దేశ నిర్మాణం కోసం ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి అన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మూడు రోడ్లు ప్రధాన కూడలిలో గల భారత రాజ్యాంగం నిర్మాత,భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రెస్ క్లబ్‌ ఆద్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులు ను స్మరించుకున్నారు. ఆయన వెంట నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,నార్లపాటి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -