నవతెలంగాణ – తుర్కపల్లి
యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి తాగే వారిపట్ల అమ్మే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తగ్గియోద్దీన్ అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామ శివారులో అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారాని సమాచారం మేరకు సిబ్బందితో కలిసి మాదాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి దొరికిందని, సదర్ నిందితులు అట్టి గంజాయిని కలకత్తా నుండి కొనుగోలు చేసి మాదాపురంకు తరలించి అమ్ముతున్నారని అన్నారు. నిందితులు ఒగ్గు బాబు జూకంటి సత్యం, ఒగ్గు నవీన్ కుమార్ జూకంటి శివకుమార్ దిరావత్ దేవేందర్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 200 గ్రాముల గంజాయి, ఫ్యాషన్ మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
యువత గంజాయికి దూరంగా ఉండాలి: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



