Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు..

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, గాల్ రెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad