నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి మండలంలోని ఎనాబోర గ్రామ సర్పంచ్ అయిన యూన్యస్ పటేల్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ అలాగే జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు, జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన జుక్కల్ ఎమ్మెల్యేకు, జిల్లా అధ్యక్షునికి, రాష్ట్ర అధ్యక్షునికి, అలాగే షబ్బీర్ అలీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జుక్కల్ ఎమ్మెల్యేకు జిల్లా ప్రజలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉగాది పర్వదినం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా యూనుస్ పటేల్
- Advertisement -
- Advertisement -



