పంటల పరిశీలన వరద బాదితులకు పరామర్శ
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ
నవతెలంగాణ – మద్నూర్
భారీ వర్షాల మూలంగా మద్నూర్, డోంగ్లి, మండలాల్లో జరిగిన పంట నష్టం అలాగే వరద బాధ్యతూలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టం జరిగిన రోడ్లు నష్టం జరిగినా ప్రభుత్వం వరద బాధ్యతూలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ హామీ ఇచ్చారు. మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వరద బాధ్యతూల పునరావాస కేంద్రాన్ని ఎంపీ సందర్శించి పరామర్శించారు. వారి సాధక బాధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద బాధ్యతూలకు జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన సంతోషం వ్యక్తపరిచారు. పునరావాస కేంద్రంలో వరద బాధ్యతూలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఎంపీ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ కు సూచించారు. ఎంపీ వెంట మద్నూర్ డోంగ్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మద్నూర్, డోంగ్లి మండలాలను సందర్శించిన జహీరాబాద్ ఎంపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES