- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలం లోని పెట్ సంగెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగెం క్రీడా మైదానంలో గురువారం ఎస్జీఫ్ పాఠశాల విదార్థుల కు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయికి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు, ఈ నెలలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. ఎంపిక పోటీలో ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -