​ఆహా..! ఏం ఐడియా సార్!

12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో నీటి కటకట మొదలైంది. బోర్లు ఎండిపోతున్నాయి, రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. ఈ కరువును ఎలా ఎదుర్కోవాలా అని అందరూ ఆలోచిస్తుంటే... మన ఆర్టీసీ మాత్రం అత్యంత ‘తెలివైన నిర్ణయం’ తీసుకుంది. అదేంటంటే లగ్జరీ, రాజధాని బస్సుల్లో ఇచ్చే ఆ ‘అరలీటరు వాటర్ బాటిల్’ ఎత్తేయడం! ఆహా! ఏం ఐడియా సార్! ప్రయాణికుల నోటికాడి నీళ్లు గుంజుకుంటే రాష్ట్రంలో కరువు తీరిపోతుందని ఏ మేధావి సలహా ఇచ్చారో గానీ, వారికి నిజంగా సన్మానం చేయాల్సిందే. మరి టికెట్ రేటులో వాటర్ బాటిల్ డబ్బులు కట్ చేయడం మాత్రం ఆపలేదు.

పాపం, బస్సులో ప్రయాణించే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు దాహంతో విలవిలలాడిపోతుంటే... ‘‘కరువు ఉంది కదా, కాస్త సర్దుకోండి’’ అన్నట్టుంది ఆర్టీసీ తీరు. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు... నీటి పొదుపు పేరుతో కనీస మానవత్వాన్ని కూడా ఆర్టీసీ మర్చిపోయింది. ‘‘డబ్బులు తీసుకుని నీళ్లివ్వకపోవడం అంటే అది ‘పొదుపు’ కాదు, పక్కా ‘దగా’! రవాణా శాఖ మంత్రికి, ఆర్టీసీ ఎండీకి ఈ విషయం తెలియదా? లేక మా దాహంతోనే రిజర్వాయర్లు నింపాలని ప్లాన్ చేస్తున్నారా?’’ అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

- గుడిగ రఘు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్