ఏండ్లుగా కొన్ని ఆచార చట్టాలు మహిళలకు ఎలాంటి హక్కులూ లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భూమిపై వారి హక్కులను నియంత్రిస్తున్నాయి. వందలాది మంది ఆదివాసీ మహిళలు తమ హక్కు కోసం పోరాడుతున్నారు. ఇన్నేండ్లకు వారి పోరాటానికి సుప్రీం కోర్టు తీర్పు రూపంలో విజయం లభించింది. వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఆ తీర్పు గురించి మరిన్ని వివరాలు నేటి మానవిలో…
బిటియా ముర్ము తండ్రి 1980లో ఆమెకు కేవలం ఏడాదిన్నర వయసున్నప్పుడు మరణించారు. కుటుంబ సభ్యులు బాధపడుతూ రాబోయే ఇరవై ఏండ్లలో ఆ సంఘటన ద్వారా వారి జీవితాలు మారిపోతాయాని గుర్తించలేదు. ఆమె తండ్రి జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలోని వారి గ్రామానికి అధిపతిగా ఉండేవారు. ఆయనకు పెద్దఎత్తున భూమి ఉంది. కానీ ఆ కుటుంబానికి చెందిన సంతల్ ఆదివాసీ సమాజం ఆచార చట్టాల ప్రకారం ఆమె వితంతువు తల్లికి భూమిపై ఎటువంటి హక్కులూ లేవు. దాంతో ముర్ము మామలు ఆమె నుండి భూమిని లాగేసుకున్నారు. ఆమెను, ముగ్గురు అమ్మాయిలను ఉమ్మడి కుటుంబ దయపై వదిలేశారు. ‘నా తల్లిని ఆమె అత్తమామలు తీవ్ర మానసిక హింసకు గురిచేశారు. కానీ ఆమెకు వేరే అవకాశం లేక అక్కడే ఉండిపోయింది. ముగ్గురు ఆడపిల్లల భారం పడుతుందని ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకే పుట్టింటికి కూడా వెళ్లలేకపోయింది. మా అమ్మ పోలీసులను, గ్రామసభ వారిని కూడా కలిసింది కానీ ఎవరూ మాకు సహాయం చేయలేదు’ అని ముర్ము పంచుకున్నారు.
ఆచారా చట్టాలు
1925 నాటి భారతీయ వారసత్వ చట్టం క్రైస్తవ, పార్సీ వారికి వారసత్వాన్ని నియంత్రిస్తుంది. అయితే హిందూ వారసత్వ చట్టం 1956 హిందూ, బౌద్ధ, సిక్కు మతస్తులకు వర్తిస్తుంది.1937 నాటి ముస్లిం వ్యక్తిగత చట్టం ముస్లింలకు వర్తిస్తుంది. ఈ చట్టాలన్నీ మహిళలకు వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వాముల భూమితో పాటు ఇతర ఆస్తులపై కొన్ని హక్కులను ఇచ్చింది. అయితే షెడ్యూల్డ్ తెగలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, దాని 5,6 షెడ్యూల్‌ల నుండి ముఖ్యమైన స్వయం పాలన అధికారాలను పొందు తాయి. దీని నిబంధనలలో ఆచార చట్టం ప్రాధాన్యత కూడా ఉంది. వారసత్వ సమస్యపై, హిందూ వారసత్వ చట్టం ఈ సమాజాలు తమ ఆచార చట్టాలను పాటించాల్సిన బాధ్యతను నిర్ధారించింది. వాటిని చట్ట పరిధి నుండి మినహాయించింది. అందువల్ల భారతీయ న్యాయశాస్త్రంలో గిరిజన మహిళలు వారి తండ్రి లేదా భర్త నుండి వారసత్వ హక్కును పొందకుండా నిరోధించే నిర్దిష్ట చట్టాలు లేవు.
35 ఏండ్ల పోరాటం
జార్ఖండ్ జ్యుడీషియల్ అకాడమీ భూ చట్టాలపై హ్యాండ్‌బుక్‌లో ఒరాన్ తెగల ఆచార పద్ధతుల గురించి ఒక వ్యాసం ఉంది. మరణించిన వ్యక్తి ఆస్తి పురుషుల స్వాధీనంలోకి వెళుతుంది. ‘కుమార్తెలు పెద్దయ్యాక వారి పెండ్లి చేయడం ఈ బంధువుల విధి’ అని అది పేర్కొంది. పిల్లలు లేని వితంతువు ఆమె తండ్రి ఇంటికి వెళుతుంది లేదా ఆమె కుమార్తెలతో నివసిస్తుంది. అలా ముర్ము కుటుంబం కూడా ఆచార చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తోంది. అయితే జూలై 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముర్ముతో పాటు తమ భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఎంతో మంది ఆదివాసీ మహిళలకు ఊరటనిచ్చింది. 35 ఏండ్లకు పైగా కొనసాగుతున్న వారి న్యాయ పోరాటంలో సుప్రీం కోర్టు ట్రయల్ కోర్టు, అప్పీలేట్ కోర్టు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తోసిపుచ్చింది.
పిటిషనర్ ప్రకారం…
తీర్పు ఇచ్చిన కేసు ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో నివసించే దహియా అనే గోండ్ గిరిజన మహిళకు చెందిన భూమికి సంబంధించినది. పిటిషనర్ ప్రకారం తన అమ్మమ్మ నుండి తండ్రికి భూమి వచ్చింది. అయితే ఆమె మరణించిన తర్వాత ఆమె కుటుంబం ఆ భూమిని స్వాధీనం చేసుకుని సింగ్ కుటుంబానికి వారసత్వంగా ఇవ్వడానికి నిరాకరించింది. ‘నాకు ఇప్పుడు 36 ఏండ్లు. నా తల్లిదండ్రులు నేను పుట్టకముందే ఈ పోరాటం ప్రారంభించారు. మేము మా హక్కుల కోసం మాత్రమే పోరాడాము’ అని ఆమె పంచుకున్నారు.
మహిళలపై వివక్ష చూపరాదు
తీర్పులో, న్యాయమూర్తులు సంజయ్ కరోల్, జోరుమల్య బాగ్చి ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉపయోగించి మరణించిన స్త్రీకి ఆమె పూర్వీకులు ఆమెకు వారసత్వంగా ఇచ్చిన భూమిపై హక్కులను కాపాడారు. స్త్రీలకు కాకుండా వారి పూర్వీకుల ఆస్తిపై పురుషులకు మాత్రమే వారసత్వం మంజూరు చేయడానికి ఎటువంటి హేతుబద్ధ లేదు. ముఖ్యంగా చట్టం ప్రకారం ఎటువంటి నిషేధం లేదు’ అని వారు పేర్కొన్నారు. అలాగే ఆచారాలను మహిళలపై వివక్ష చూపడానికి ఉపయోగించరాదని కూడా తీర్పు పేర్కొంది. ఈ తీర్పును దేశవ్యాప్తంగా స్త్రీవాద, ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. ఆదివాసీ కార్యకర్త ఎలినా హోరో మాట్లాడుతూ ‘భారతదేశంలోని ఆదివాసీ మహిళలకు కీలకమైన మలుపు’ అన్నారు. ఆర్థికవేత్త బినా అగర్వాల్ మాట్లాడుతూ ‘భారతదేశంలోని అన్ని గిరిజన మహిళలకు లింగ సమాన వారసత్వ హక్కులను విస్తరించడానికి ఒక ప్రమాణం కాగలదు’ అన్నారు.
పాక్షిక విజయమే
ఈ తీర్పును స్వీకరించడానికి ఆదివాసీ సమాజంలోని అందరూ సిద్ధంగా లేరు. ఛత్తీస్‌గఢ్‌లో సర్వ ఆదివాసీ సమాజ్ నాయకులు మాట్లాడుతూ ‘మహిళలకు భూమి వారసత్వ హక్కులు పాత ఆచారాలను తుడిచివేస్తాయి, సమాజంలో సంఘర్షణను ప్రేరేపిస్తాయి, మహిళలపై హింసను పెంచుతాయి’ అన్నారు. ఆదివాసీ మేధావులు ఉన్న జార్ఖండ్‌లో ఈ విషయంపై విస్తృతమైన చర్చలు జరిగాయి. అయితే మహిళలతో సహా అనేక మంది ఆదివాసీ కార్యకర్తలు ఈ తీర్పును విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కౌంటర్ అప్పీల్ దాఖలు చేయడాన్ని పరిశీలిస్తామని కొందరన్నారు. దీన్ని బట్టి ముర్ము తన భూమి కోసం తీవ్ర పోరాటం చేసింది, కానీ పాక్షిక విజయమే సాధించింది.
తీర్పు ఎలా చెప్పగలను?
2016లో ముర్ము తన కుటుంబ భూమి హక్కులను గుర్తించాలని కోరుతూ దుమ్కాలోని సబ్‌డివిజనల్ ఆఫీసర్ కోర్టును ఆశ్రయించింది. ‘మీ ఆచారాల ప్రకారం మహిళలు భూమిని వారసత్వంగా పొందరు, కాబట్టి నేను మీకు అనుకూలంగా తీర్పు ఎలా చెప్పగలను? వారసత్వంగా భూమిని పొందిన మహిళ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి’ అని మేజిస్ట్రేట్ తనతో చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. నిరాశ చెందిన ముర్ము మళ్ళీ సంప్రదాయ పరిష్కార వ్యవస్థ వైపు తిరిగి, ఉన్నత సంప్రదాయ న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు గ్రామసభ సభ్యులకు తెలియజేసింది. ‘దీనిపై వారు ఒక సమావేశం నిర్వహించి, ఆదివాసీ మహిళలు భూమిని వారసత్వంగా పొందనందున నాకు భూమి రాదని చెప్పారు’ అని ఆమె పంచుకున్నారు.
అనుకూలంగా తీర్పు ఇచ్చినా…
ఏదిఏమైనప్పటికీ తన ప్రణాళికలతో ముర్ము ముందుకు సాగింది. 2018లో పొరుగు గ్రామాల పెద్దలతో కూడిన సాంప్రదాయ కోర్టు మోర్ మాంఝిని ఆశ్రయించింది. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అది తన మామలతో, ‘మీ దివంగత సోదరుడి భూమిని తీసుకోవడానికి సరైన మార్గం ఉంది. మీరు అతని కుటుంబాన్ని అసలు చూసుకున్నారా? మీరు వారికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. అప్పుడు వారి భూమిపై మీకు ఏ హక్కు ఉంది?’ అన్నారు. ఈ సాంప్రదాయ తీర్పుతో ఆమె మామలు భూమిని తిరిగి ఇచ్చినప్పటికీ హక్కు దస్తావేజును మాత్రం అప్పగించలేదు. గ్రామ పంచాయతీ మాత్రం భూమిపై ప్రాథమిక హక్కులను అందిస్తూ ఒక లేఖను జారీ చేసింది. అయితే ఈ లేఖ అంత స్పష్టంగా లేదు.
ఒంటరి మహిళల సమిష్టి
‘నేను భూమిని వ్యవసాయం కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ నేను చనిపోయిన రోజు దానిని నా తండ్రి కుటుంబానికి తిరిగి వెళ్లిపోతుంది. నా పిల్లలు దాన్ని వారసత్వంగా పొందలేరు. దాంతో ఈ తీర్పు ఆమెకు పూర్తిగా న్యాయం చేయలేదు. దాంతో ముర్ము 1990లలో సామాజిక సేవ రంగంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి సంతల్ పరగణా ప్రాంతంలో ఆదివాసీ మహిళల హక్కులపై పనిచేస్తుంది. నేడు ఆమె లహంతి అనే సంస్థను నడుపుతోంది. మహిళల భూమి హక్కుల కోసం పోరాడే ఏకల్ నారి సంగథన్ లేదా ‘ఒంటరి మహిళల సమిష్టి’కి కూడా నాయకత్వం వహిస్తోంది.
మహిళలు భూమిని కాపాడుకోలేరా..?
సుప్రీంకోర్టు తీర్పు ముర్ముకు ఆశను కలిగించిం ది. ఆమె మళ్ళీ కోర్టులను ఆశ్రయించాలని ఆలోచి స్తున్నట్లు చెప్పారు. ‘ఏండ్లుగా మాకు ఎలాంటి ఆధారం లేదు. కానీ ఈ కొత్త తీర్పు పరిస్థితిని మార్చగలదు’ అని ఆమె అన్నారు. అయితే ఆదివాసీ మహిళలందరూ ఈ తీర్పును సమర్థించరు. జార్ఖండ్ ఆదివాసీ మహిళా సంఘం సభ్యురాలు, కార్యకర్త రోసాలియా టిర్కీ ఇతర ప్రాంతాలలో మహిళల హక్కుల కోసం వాదిస్తారు, కానీ మహిళ లకు భూమి హక్కులను వ్యతిరేకిస్తారు. ఆదివాసీ మహిళలు వివాహం చేసుకున్నప్పుడు, వారు సాధారణంగా తమ జన్మించిన కుటుంబ వంశాన్ని వదిలి భర్త వంశంలో చేరతారని టిర్కీ అన్నారు. ఇది చాలా మంది ఆదివాసీ మహిళలకు వర్తిస్తుంది. భూమిని వారసత్వంగా పొందితే దాన్ని మేము జాగ్రత్తగా చూసుకోలేము, అమ్మేసుకునే ప్రమాదం ఉంది లేదా భూమి పరాయీకరణ చెందే అవకాశం కూడా ఉంది’ అని ఆమె అంటారు.
భవిష్యత్ పోరాటం తప్పదు
ఏదిఏమైనా సుప్రీంకోర్టు తీర్పు తమ భూమిపై ఎక్కువ హక్కులను కోరుకునే మహిళలు కొంత ఆశను అందిస్తుంది. అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం వారు భవిష్యత్తులో సుదీర్ఘమైన పోరాటం చేయాల్సి వస్తుంది. ఒంటరి మహిళలతో పనిచేసే సంస్థ ఏకల్ మహిళా సంఘటన్‌లో సామాజిక కార్యకర్త అనిత ఈ విషయం గురించి తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఆమె భర్త ఆమెను ఒక బిడ్డ పుట్టిన తొలినాళ్లలోనే ఒంటరిగా వదిలేసాడు. అప్పటి నుండి భరణం కోసం అనేక కేసులు దాఖలు చేసింది. ఇప్పటివరకు ఆమెకు న్యాయం జరగలేదు. ‘నేను ఒంటరిగానే నా బిడ్డను పెంచి, చదివించి, వివాహం చేసాను. నా భర్త నుండి ఇప్పటి వరకు మద్దతుగా ఒక్క రూపాయి కూడా రాలేదు’ అన్నారు. ఆమె భూమి హక్కులపై తన ఆందోళనలను మరింత పెంచింది. ప్రస్తుత సుప్రీం కోర్టు తీర్పు ఆమెకు కొంత ఊరటనిచ్చింది. ఇలాంటి మహిళలు ఎందరో ఈ తీర్పుతో ప్రయోజనం పొందబోతున్నారు. కానీ దీని అమలు కోసం కింది స్థాయిలో మాత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.
తీర్పు ఎలా చెప్పగలను?
2016లో ముర్ము తన కుటుంబ భూమి హక్కులను గుర్తించాలని కోరుతూ దుమ్కాలోని సబ్‌డివిజనల్ ఆఫీసర్ కోర్టును ఆశ్రయించింది. ‘మీ ఆచారాల ప్రకారం మహిళలు భూమిని వారసత్వంగా పొందరు, కాబట్టి నేను మీకు అనుకూలంగా తీర్పు ఎలా చెప్పగలను? వారసత్వంగా భూమిని పొందిన మహిళ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి’ అని మేజిస్ట్రేట్ తనతో చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. నిరాశ చెందిన ముర్ము మళ్ళీ సంప్రదాయ పరిష్కార వ్యవస్థ వైపు తిరిగి, ఉన్నత సంప్రదాయ న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు గ్రామసభ సభ్యులకు తెలియజేసింది. ‘దీనిపై వారు ఒక సమావేశం నిర్వహించి, ఆదివాసీ మహిళలు భూమిని వారసత్వంగా పొందనందున నాకు భూమి రాదని చెప్పారు’ అని ఆమె పంచుకున్నారు.
ఆదివాసీ మహిళలు ఎందుకు పోరాడుతున్నారు?
- Advertisement -
- Advertisement -