పండుగ జరిగిన అనతి కాలంలోనే గుడిలో దొంగతనం
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ముదిరాజ్ సంఘం పెద్దలు
నవతెలంగాణ – రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ గుడిలో గంటలు చోరీకి గురైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ముదిరాజ్ సంఘం నాయకులు భీమని యాదగిరి, భీమని శ్రీను సమాచారం మేరకు.. ఏప్రిల్ 30వ తేదీన పెద్దమ్మ తల్లి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని. ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ గుడులో గంటలను ఏర్పాటు చేశామని. ప్రతిరోజు గుడికి వెళ్లే భక్తులు గుడి గంటలు కొట్టి దేవతలను కొల్చుకుంటున్నారు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి గుడిలో గంటలు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం గుడికి వెళ్లిన స్థానికులకు గంటలు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. దాంతో రాయపర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. చోరీ వ్యవహారంపై ఎస్సై శ్రావణ్ కుమార్ ను వివరాలు కోరగా.. ముదిరాజ్ సంఘం పెద్దలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ గుడిలో గంటలు చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES