Thursday, April 16, 2026
E-PAPER
Homeక్రైమ్ఏసీబీకి చిక్కిన హుజురాబాద్‌ మున్సిపల్‌ ఏఈ

ఏసీబీకి చిక్కిన హుజురాబాద్‌ మున్సిపల్‌ ఏఈ

- Advertisement -

– రూ.50వేలు లంచం తీసుకుంటూ.. పట్టుబడిన వైనం
నవతెలంగాణ – హుజురాబాద్‌

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మున్సిపాలిటీలో ఏఈ సుధాకర్‌రెడ్డి బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. హుజురాబాద్‌ మున్సిపాలిటీలో నుసుం సుధాకర్‌రెడ్డి ఏఈగా ఇటీవలే నియమితులయ్యారు. ప్రొబెషన్‌ పీరియడ్‌ పూర్తి కాలేదు. పట్టణంలోని వరంగల్‌ రోడ్‌లో డ్రెయినేజీ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్‌ సంతోష్‌కు మొదటి బిల్లు రూ.4లక్షల వచ్చింది. మరో రూ.14లక్షల బిల్లు కోసం ఎంబీ రికార్డు చేయాల్సి ఉంది. ఎంబి రికార్డు చేసి ఉన్నతాధికారులకు బిల్లు పంపడానికి 50వేల రూపాయల లంచం ఇవ్వాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశాడు. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని కాంట్రాక్టర్‌ చెప్పినప్పటికీ ఏఈ వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్టర్‌ సంతోష్‌ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల ప్రకారం బుధవారం రూ.50వేలు వరంగల్‌ రోడ్‌లోని ఒక మటన్‌ షాపు వెనుక తీసుకోవడానికి ఏఈ సుధాకర్‌రెడ్డి ఓకే చెప్పాడు. డబ్బులు తీసుకుంటున్న సుధాకర్‌రెడ్డిని ఏసీబీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్టు ఏసీబీ సీఐ పున్నం చందర్‌ తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించగా అనేక విషయాలు బయట పడ్డాయని తెలిపారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -