Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా డిమాండ్లను జూన్ 2 నాటికి పరిష్కరించాలి

మా డిమాండ్లను జూన్ 2 నాటికి పరిష్కరించాలి

- Advertisement -

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు
నవతెలంగాణ – మద్నూర్

ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం మద్నూర్ మండలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. అనంతరం మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కు డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లు జూన్ 2 నాటికి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెడ్లైన్ విధించారు.

“జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలి, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి, హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి, సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలి. పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డిజే లను విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.” ఈ విధమైన డిమాండ్లతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యోగులు నిరసన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -