Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం పునరుద్ధరణకు కోఆర్డినేషన్‌ కమిటీ

కాళేశ్వరం పునరుద్ధరణకు కోఆర్డినేషన్‌ కమిటీ

- Advertisement -

చైర్మెన్‌గా కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఇ.శ్రీధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొరంగ నిపుణులు కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా చైర్మెన్‌గా, నీటి పారుదల శాఖ సంయుక్త కార్యదర్శి (టెక్నికల్‌) కె.శ్రీనివాస్‌, సీడీవో ఛీప్‌ ఇంజినీర్‌ ఎంఎస్‌ఎన్‌.రెడ్డి, సెంటర్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అదనపు డైరెక్టర్‌ సెల్వబాలన్‌, అఫ్రే ఇండియా లిమిటెడ్‌ ఎండీ సాయిక్రిష్ణ, ఎల్‌అండ్‌టీ జీఎం ఎస్‌.సురేష్‌కుమార్‌, ఆఫ్కాన్‌ ఉపాధ్యక్షులు మల్లిఖార్జునరావు, నవయుగ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మాధవ్‌, రామగుండం సీఈ శ్రీనివాసరావు గుప్తను సభ్యులుగా నియమించారు. వర్షాకాలానికి ముందే మే 30 లోగా జియో టెక్నికల్‌ పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ విధించింది. రోజువారీ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించాలని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఎన్డీఎస్‌ఏ అనుమతులతో పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -