Saturday, April 18, 2026
E-PAPER
Homeబీజినెస్వెనిజులాతో సంబంధాల పునరుద్ధరణ

వెనిజులాతో సంబంధాల పునరుద్ధరణ

- Advertisement -

ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వెల్లడి
వాషింగ్టన్‌
: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్‌ నేతృత్వంలో వెనిజులాతో సంబంధాలు పునరుద్ధరించుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌లు ప్రకటించాయి. 2019లో వెనిజులా అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదంగా జరిగాయంటూ అమెరికా అభాండాలు మోపిన నేపథ్యంలో ఈ రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనిజులాతో సంబంధాలు రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా వున్న డెల్సీ రొడ్రిగజ్‌ ప్రభుత్వంతో తమ సంస్థ సంబంధాలు పునరుద్ధరించుకుందని గురువారం ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జివా ఒక ప్రకటలో తెలిపారు. ఈ కీలక చర్య వల్ల వెనిజులన్లకు అంతిమంగా ప్రయోజనం చేకూరుతుందని ఆమె సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు. ఆ కొద్ది సేపటికే తాము ఐఎంఎఫ్‌ నిర్ణయాన్ని అనుసరిస్తున్నామని ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. 2005లో చివరిసారిగా వెనిజులాకు రుణం అందచేశామని బ్యాంక్‌ తెలిపింది. 2020లో కోవిడ్‌ నేపథ్యంలో తమకు అత్యవసరంగా రుణ సహాయం కావాలని వెనిజులా అభ్యర్థించినా..ఐఎంఎఫ్‌ ఏమాత్రం కనికరం చూపింది లేదు. రుణ అభ్యర్థనను తిరస్కరించింది. మహామ్మారి ముంచెత్తిన అంతటి విషాద సమయంలోనూ మదురో నాయకత్వ చట్టబద్ధతపై అంతర్జాతీయ ఏకాభిప్రాయం లేదంటూ ఐఎంఎఫ్‌ సాకులు చెప్పింది. రొడ్రిగజ్‌పై గల ఆంక్షలను ఎత్తివేశామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన పలు వారాల తర్వాత ఈ ప్రకటనలు వెలువడ్డాయి. కాగా, తాజా ప్రకటనలను వెనిజులా నేత స్వాగతించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది వెనిజులా దౌత్యానికి లభించిన గొప్ప విజయమని ఆమె వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వ టెలివిజన్‌లో ఆమె ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా రుణ భారం వున్న దేశాల్లో వెనిజులా ఒకటి. మొత్తంగా విదేశీ రుణాలు 150 బిలియన్ల డాలర్లుపైనే వున్నాయి. అయితే తమ దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవాలంటే అంతర్జాతీయ సంస్థల నుండి తోడ్పాటు అందడం తమకు అవసరమని వెనిజులా ప్రభుత్వం పేర్కొంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -