Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీని, దాంతో చేతులు కలిపిన వారినీ ఓడించాలి

బీజేపీని, దాంతో చేతులు కలిపిన వారినీ ఓడించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతుగా ప్రకాశ్‌రాజ్‌ ప్రచారం
చెన్నై :
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని, దానితో చేతులు కలిపిన పార్టీలనూ చిత్తుచిత్తుగా ఓడిం చాలని ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పిలుపునిచ్చారు. తమిళ నాడులోని పళని నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్‌ పాండికి మద్దతుగా నిర్వహించిన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ బీజేపీయేతర ప్రభుత్వాల, సామాజిక కార్యకర్తల అసమ్మతి స్వరాలను మోడీ ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తుందని విమర్శిం చారు. ఈ ఎన్నికల్లో బీజేపీని, అన్నా డీఎంకేను, వాటితో చేతులు కలిపిన పార్టీలను ఓడించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -