సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు
తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసమానతలు లేని సమాజం కమ్యూనిజంతోనే సాధ్యమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహ చెప్పారు. ప్రతి మనిషికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు లభించాలంటే ప్రస్తుత పాలనా విధానాల్లో మార్పు అవసరమన్నారు. బుధవారం హైదరాబాద్‌లో డీహెచ్‌పీఎస్ రెండో రాష్ట్ర మహాసభల లోగోను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షను అరికట్టాలంటే కేవలం చట్టాలు సరిపోవనీ, సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భూమి, విద్య, ఉపాధి రంగాల్లో సమానత్వం లేకుండా నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దళితులకు రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్నప్పటికీ అవి పూర్తిగా అమలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు జేరిపోతుల కుమార్, వై ఉషా శ్రీ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి టి కొమురెల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
అసమానతలు లేని సమాజం కమ్యూనిజంతోనే సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



