33శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఐద్వా ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. అనేక మహిళ సంఘాలు దశాబ్దాలుగా పోరాటాలు చేసిన ఫలితంగానే 2010లో రాజ్యాసభలో రిజర్వేషన్ బిల్లు అమోదం పొదిందని గుర్తు చేశారు. ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ భవనంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 33 శాతం మహిళ రిజర్వేషన్ బిల్లు జనగణన, నియోకవర్గాల పునర్విభజన తర్వాతనే అమలు చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. దేశంలో అతి పెద్ద మహిళా సంఘం ఐద్వా మాత్రమేనని గుర్తుచేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరారు. మహిళ సాధికారత పట్ల నిజమైన నిబద్ధత ఉంటే ఇప్పటికే ఉన్న స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అములుచేయాలని కోరారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా రిజర్వేషను కల్పించాలని సూచించారు. 2029 ఎన్నికలలో ఎలాంటి షరతులు లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రజాస్వామిక శక్తులన్నీ తమ గళాన్ని వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, రాష్ట్ర సహాయక కార్యదర్శులు కెఎన్ ఆశాలత, బుగ్గవీటి సరళ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. నాగలక్ష్మి, ఎన్. రత్నమాల, బండి పద్మ, కె. గీతారాణి, పి. శశికళ తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో మహిళలకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



