నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ మొత్తం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో కార్మికులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ పోరాటాలను ఉత్తరప్రదేశ్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు క్రూరంగా అణచివేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నోయిడా ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు రోజుకు పది నుంచి 13 గంటలు పనిచేస్తే నెలకు కేవలం రూ.పది వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. డబుల్ ఓటీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్, ఉద్యోగ భద్రత వంటి సౌకర్యాలు పరిశ్రమల యాజమాన్యాలు కల్పించకపోవడంతో కార్మికులు రూ.26 వేల కనీస వేతనం, ఎనిమిది గంటల పనివిధానం, ఓటీ, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ నోయిడాలో 50 వేల మంది కార్మికులు పోరాటం చేస్తున్నారని వివరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వారి పోరాటాన్ని అణచివేస్తూ 400 మందికిపైగా కార్మికులను అరెస్టు చేశాయని తెలిపారు. అనేక మంది సీఐటీయూ నాయకులను నిర్బంధించాయని పేర్కొన్నారు. మహిళా కార్మికులపై భౌతిక దాడులు జరిగాయని తెలిపారు. ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి పోరాటాన్ని దుర్మార్గంగా అణచివేస్తున్నదని పేర్కొన్నారు. పెరుగుతున్న దాడులు, అణచివేతకు నిరసనగా సమ్మెలో ఉన్న కార్మికులకు అండగా నిలవాలని కోరుతూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో, పారిశ్రామిక క్లస్టర్లు, పరిశ్రమల వ్ద రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
నోయిడా కార్మికుల పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



