- Advertisement -
లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా…
పాట్నా: బీహార్ 21వ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరీ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన కీలక నాయకులు, కూటమి భాగస్వాములు పాల్గొన్నారు. ఆయన బీహార్‌లో బీజేపీ నుంచి సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడు కావటం విశేషం. ఆయనతో పాటు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజరుకుమార్ చౌదరీలు ఉప ముఖ్యమంత్రు లుగా ప్రమాణం చేశారు. ఈసందర్భంగా సామ్రాట్‌కు బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



