26 మందితో పొలిట్‌బ్యూరో
పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలు ప్రకటన
అమరావతి :టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నారా లోకేష్‌ను ఆ పార్టీ నియమించింది. ప్రస్తుతం లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఎప్పుడు, ఎవరికీ లేని పదవిని కొత్తగా సృష్టించి లోకేష్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. గతేడాది కడపలో జరిగిన మహానాడు సమయంలోనే లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు అప్పగి స్తారని పార్టీ నేతలు భావించినా ప్రకటించ లేదు. పార్టీలో అన్ని కమిటీలు, పొలిట్‌బ్యూరో, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, అధికార ప్రతి నిధులతో పాటు రాష్ట్ర కమిటీని బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, మంత్రులు కె అచ్చెన్నా యుడు, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, బిసి జనార్ధన్ రెడ్డితో పాటు గంట్యాడ శ్రీదేవి, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ, మహ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్, గుత్తికొండ ధనుంజరు, నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనంద్‌బాబు, పిడుగురాళ్ల(గళ్లా) మాధవి, దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాలవ శ్రీనివాసులుతో పొలిట్‌బ్యూరో ఏర్పాటైంది. తెలంగాణ నుంచి అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులుకు అవకాశం ఇవ్వగా, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులును ప్రకటించింది.
జాతీయ కోశాధికారిగా కొనకళ్ల నారాయణను ప్రకటించగా, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలారును ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా దువ్వారపు రామారావు, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ రావు, మహ్మద్ నజీర్, సానా సతీష్, రెడ్డి సుబ్ర హ్మణ్యం, పీతల సుజాత, ముళ్లపూడి బాపిరాజు, ఎం వెంకటేశ్వరరావు, బురగడ్డ వేదవ్యాస్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వైవిబి రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, టిడి జనార్ధన్‌రావు, నూకసాని బాలాజీ, బొల్లినేని రామారావు, బాలిశెట్టి హరిప్రసాద్, బి రాంగోపాల్ రెడ్డి, మాధవ నాయుడును నియమించారు. జాతీయ అధికార ప్రతినిధులుగా ఎంపి కె అప్పలనాయుడు, టి కృష్ణప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దీపక్ రెడ్డి, బికె పార్థసారధి, ఎన్ విజరుకుమార్, టి జ్యోత్స్న, నర్సిరెడ్డిని నియమించారు. రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావును ప్రకటించగా, రాష్ట్ర కమిటీలో ఏడుగురికి ప్రధాన కార్యదర్శులుగా, 16 మందికి ఉపాధ్యక్షులుగా, 14 మందికి అధికార ప్రతినిధులుగా, 10 మందికి జోనల్ కో-ఆర్డినేటర్లుగా, 59 మందితో కార్యనిర్వాహక కార్యదర్శులుగా, 77 మందికి కార్యదర్శులుగా ప్రకటించారు. నాలెడ్జ్ కమిటీ ఛైర్మన్‌గా గురజాల మాల్యాద్రిని, హెచ్‌ఆర్‌డి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిని, మీడియా కమిటీకి దారపునేని నరేంద్ర, బివి వెంకటరాముడును ప్రకటించారు.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా లోకేష్
- Advertisement -
- Advertisement -



