Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీని అడ్డుకుందాం

బీజేపీని అడ్డుకుందాం

- Advertisement -

– తమిళనాడులో ఆ పార్టీ కుతంత్రాలను తిప్పికొట్టాలి : సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ
తిరువొత్తియూర్‌ :
తమిళనాడులో బీజేపీని ఎదగకుండా చూడాలని, ఆ పార్టీ అనుసరిస్తున్న మతవిభజన రాజకీయాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ ఆధ్వర్యంలో సత్తంగడు, మండైవేలి మార్కెట్లలో జరిగిన బహిరంగ సభలను ఉద్దేశించి బేబీ ప్రసంగించారు. తమిళనాడులోని తిరువొత్తియూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి సుందరరాజన్‌కు, మైలాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి మైలై వేలుకు ఆయన మద్దతు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా, ‘తమిళనాడు అంటరానితన నిర్మూలన వేదిక’ (టీఎన్‌యూఈఎఫ్‌) రూపొందించిన ”ఓటే శక్తి!” అనే కరపత్రాన్ని బేబీ ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. కన్నన్‌ ఈ ప్రచురణను బేబీ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌యూఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పీ. సుగంధి, ఉప ప్రధాన కార్యదర్శులు జు. మోహన , జానకిరామన్‌, సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కమిటీ సభ్యులు బద్రి , ఆరుముగ నైనార్‌తో పాటు ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -