– సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి : అగ్ర నాయకురాలు బృందాకరత్ పిలుపు
– తమిళనాడులోని తిరువొత్తియూర్, గంధర్వకోట్టై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం
కరంబక్కుడి : తమిళనాడులో ప్రవేశించటా నికి ఈపీఎస్ భుజాలపై స్వారీ చేస్తూ బీజేపీ కుట్రలు చేస్తోందని, అలాంటి కుయుక్తులను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. మనాలి బస్ టెర్మినల్ సమీపంలోనూ, కరంబక్కుడిలో ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తమిళనాడు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు.
తమిళనాడులోని తిరువొత్తియూర్, గంధర్వకోట్టై అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు ఎల్. సుందరరాజన్, ఎం. చిన్నదురైలకు ఓటర్లు అండగా నిలవాలని కోరారు. ఈ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా , కూటమిలోని ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను భగం చేయండి
- Advertisement -
- Advertisement -



