పేలిన డిటోనేటర్లు..గ్యాస్ సిలిండర్లు
ఐదుగురు మృతి… 20 మందికి గాయాలు
12 మంది పరిస్థితి విషమం
కదిరి: ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ కూలీ ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో భారీ ప్రమాదం
- Advertisement -
- Advertisement -



