Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవామ్మో ఎండలు

వామ్మో ఎండలు

- Advertisement -

ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
ఈ ఏడాది ఇదే అత్యధికం
వచ్చే రెండ్రోజులు రాష్ట్రానికి వర్షసూచన
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూ ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.5 డిగ్రీల వరకు పెరిగాయి. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా నమోద య్యే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న ప్రకటించా రు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామా బాద్‌, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మెదక్‌, వికారాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయ శంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. మరోవైపు ఆది, సోమవారా ల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చ రిక జారీ చేశారు. ఆ జాబితాలో జయశంకర్‌ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొం డ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొం డ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబా ద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంట ల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షంకురిసే సూచన లున్నాయి. ఉపరితల గాలులు నైరుతి దిశగా వీచే అవకా శముంది. శనివారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 40కిపైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అత్యధికంగా 3.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ఆదిలాబాద్‌ 43.8 డిగ్రీలు
నిజామాబాద్‌ 42.3 డిగ్రీలు
మెదక్‌ 40.6 డిగ్రీలు
రామగుండం 40.2 డిగ్రీలు
ఖమ్మం 40.0 డిగ్రీలు

అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
రేబర్తి (సిద్దిపేట) 3.65 సెంటీమీటర్లు
అబ్దుల్‌నాగారం(జనగాం) 3.40 సెంటీమీటర్లు
నర్మెట్ట(జనగాం) 3.30 సెంటీమీటర్లు
శామీర్‌పేట
(మేడ్చల్‌ మల్కాజిగిరి) 2.23 సెంటీమీటర్లు
ఈఎస్‌ఎస్‌ కేశవరం
(మేడ్చల్‌ మల్కాజిగిరి) 2.10 సెంటీమీటర్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -