Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20న సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటన

20న సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటన

- Advertisement -

మేడిగడ్డ పరిశీలనతో పాటు పుష్కరాలపై సమీక్ష
అనంతరం భారీ బహిరంగసభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ నెల20న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. గతంలో కుంగిపోయిన బ్యారేజీ పియర్లను పరిశీలించి, పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించనున్నా రు. అలాగే కాళేశ్వరంలోని గోదావరి నది వద్ద జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువం టి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. పర్యటన ముగింపులో కాళేశ్వరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పటికే రంగంలోకి దిగారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగంతో కలిసి భద్రత, సభా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భవి ష్యత్‌పై భహిరంగ సభలో సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -