Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీబీఎస్‌ఈ-2026 10వ తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

సీబీఎస్‌ఈ-2026 10వ తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థులు ఇద్దరు 499 టాప్‌ మార్కును సాధించి శ్రీచైతన్య ఆల్‌ ఇండియా నెంబర్‌ వన్‌గా మరోసారి రికార్డు సృష్టించింది. 9 మంది విద్యార్థులు 498 మార్కులకు పైగా, 19 మంది విద్యార్థులు 497 మార్కులకు పైగా, 41 మంది 496 మార్కులకు పైగా, 59 మంది 495 మార్కులకు పైగా, 268 మంది 490 మార్కులకు పైగా సాధించారు. శ్రీచైతన్య స్కూల్‌లోని అన్ని బ్రాంచీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. శ్రీచైతనరు స్కూల్‌ ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో స్టేట్‌ టాప్‌ మార్కులతో పాటు అత్యధిక యావరేజ్‌, పాస్‌ పర్సంటేజ్‌తో ఆలిండియాలోనే కాదు, రాష్ట్రాల్లో కూడా తామే నెంబర్‌ వన్‌గా ఉన్నామని ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్‌ టెక్నో కరిక్యులమ్‌ టాప్‌ మార్కుల్లో గానీ, సబ్జెక్టుల వారీగా నూటికి నూరు మార్కు ల్లో అత్యధిక సంఖ్యలో ఫలితాలు సాధించి సంచలనాత్మక రికార్డ్‌ సృష్టించిం దని ఆమె చెప్పారు. ఐఐటీ – జేఈఈ, నీట్‌, ఒలంపియాడ్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షా ఫలితాల్లో టాప్‌ ర్యాంకులతో నెంబర్‌ వన్‌గా నిలుస్తూ అటు స్టేట్‌ ఎస్సెస్సీలోనూ, ఇటు సీబీఎస్‌ఈలోనూ సంచలనాత్మక ఫలితాలతో శ్రీచైతన్య స్కూల్‌ – టెక్నో కరిక్యులమ్‌ పాఠశాల విద్యకు అసలైన నిర్వచనంగా నిలిచిందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -