నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్కులను సొంతం చేసుకుంది. జూనియర్ ఇంటర్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మారినప్పటికీ ఎంపీసీలో 470 మార్కులకు 469 మార్కులను శ్రీచైతన్య విద్యార్థినీ బి.గగన సాధించారు. బైపీసీలో 455 మార్కులకు గానూ 452 మార్కులను ఇద్దరు విద్యార్థులు, సీనియర్ ఇంటర్ లో వెయ్యి మార్కులకు 992 మార్కులతో ఆరుగురు శ్రీచైతన్య విద్యార్థులు స్టేట్ టాప్ మార్కులు సాధించారు. 991 మార్కులను 37 మంది విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 466 మార్కులకు పైగా 129 మంది, 464 మార్కులకు పైగా 1,092 మంది, 460 మార్కులకు పైగా 3,620 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో 450 మార్కులకు పైగా 132 మంది , 440 మార్కులకు పైగా 1,702 మంది, 435 మార్కులకు పైగా 2,356 మంది, 430 మార్కులకు పైగా 2,940 మంది సాధించారు. ఇప్పటికే విడుదలైన జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1, 2లో 300కు 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన జేఈఈ మెయిన్ 2026లో సెషన్ 1, 2 ప్రొవిజనల్ కీ ప్రకారం 300కు 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏటా ఐఐటీ -జేఈఈ, నీట్ లలో అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారనీ, రాబోయే ఐఐటీ అడ్వాన్స్డ్ , నీట్‌లలో కూడా నెంబర్ వన్ ర్యాంకులు సాధిస్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …. శ్రీ చైతన్య సృష్టించిన పటిష్టమైన ప్రోగ్రాములు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియట్‌లో సబ్జెక్ట్స్‌పై తమ విద్యార్థులు కాన్సెప్ట్యువల్‌గా పట్టు సాధించడంతో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్ గా నిలుస్తున్నారని తెలిపారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లే ఇంటర్మీడియట్‌లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయనీ, దీంతో పాటు రాబోయే రిజల్ట్స్‌లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకం తమకుందని తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తమ విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని ఆమె అభినందించారు.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్కులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



