Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలెఫ్ట్‌ కూటమిని గెలిపిద్దాం

లెఫ్ట్‌ కూటమిని గెలిపిద్దాం

- Advertisement -

బెంగాల్‌ పూర్వ వైభవం పునరుద్ధరణకు ఇదే సమయం : బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

లెఫ్ట్‌ కూటమిని గెలిపిద్దామని బెంగాల్‌ పూర్వ వైభవం పునరుద్ధరణకు ఇదే సమయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈస్ట్‌ మిడ్నాపూర్‌ ఖాజేరి అసెంబ్లీ నియోజకవర్గం ఎల్డీఎఫ్‌ కూటమి అభ్యర్థి హిమాన్ష్‌ దాస్‌తో కలిసి నిర్వహించిన భారీ రోడ్‌ షో, ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని కార్పొరేట్లకు అమ్మెస్తుందనీ, అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిందనీ, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచిందనీ, బెంగాల్లో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తుందని విమర్సించారు. వామపక్ష ప్రభుత్వాలు పంచిన భూములు తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో గుండాలు, మాఫియా చేతుల్లో దోపిడికి గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత పాలనలో బెంగాల్‌ అరాచక శక్తులకు ఆశ్రయంగా మారిందని మండిపడ్డారు. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వామపక్షాలే నిజమైన ప్రత్యామ్నాయమని ప్రజలు లెఫ్ట్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. తృణమూల్‌ గుండాలు బుల్డోజ్‌ చేసిన ఇల్లు, కుటుంబాన్ని కోల్పోయిన బాధ మధ్య కూడా పార్టీ కోసం పోరాడుతున్న హిమాన్ష్‌ దాస్‌ నిజమైన కమ్యూనిస్టు నాయకుడని వెంకట్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమలో ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు టుసర్‌ ఘోష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -