Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్ని వర్గాలకు అధికారమే మా ధ్యేయం

అన్ని వర్గాలకు అధికారమే మా ధ్యేయం

- Advertisement -

సామాజిక, సర్వోదయ తెలంగాణ కోసం పోరాడుతా :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అన్ని వర్గాలకు అధికారాన్ని అందించటమే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సామాజిక, సర్వోదయ తెలంగాణ కోసం పోరాడుతామని ఆమె తెలిపారు. శుక్రవారం హైదరాబా ద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాల యంలో సీపీయూఎస్‌ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాది óకార కన్వీనర్‌ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్‌ నాయక్‌ తదితరులు కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లా డారు. మారోజు వీరన్న అనుచరులు మద్దతు తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారితో కలిసి పని చేస్తే తమను ఎవరూ ఆపలేరని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్‌ దారుణంగా మోసం చేసిందని కవిత విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీని అమలు చేస్తామని నమ్మబలికి…ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలైన సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ స్కీం పునరు ద్ధరణను సీఎం రేవంత్‌ రెడ్డి గాలికొ దిలేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టిన నిరసనకు ఆమె మద్దతు ప్రకటించారు.
మహిళలను వంచించిన బీజేపీ…
మహిళా బిల్లు విషయంలో దేశంలోని ప్రతీ మహిళనూ బీజేపీ వంచించిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌ బిల్లుతో కలిపి వీగిపోయేలా కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2027 జన గణనలో ఓబీసీలను లెక్కించి, వాటి ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు.
ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా?
పదేండ్లపాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానోదయమైందా? అని బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి కవిత ఎద్దేవా చేశారు. వారు పాదయాత్రలు చేసేది ప్రజలపై ప్రేమతో కాదని, అధికారం కోసమేనని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును తాను ఎప్పటికీ నమ్మబోనని.. బీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు పెంచి పోషించింది ఆయనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవ గాహన ఉందన్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిసి లోగు ట్టు విప్పారని చెప్పారు. దళిత క్రైస్త వులకు ఎస్సీ హోదా అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేస్తున్నట్టు కవిత తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -