కుండకు
చిల్లుపడ్డాక
నీళ్లెన్నిపోసినా
ఏం లాభం?
ప్రజాస్వామ్యం
నీరుకారాక
ఏ ప్రగతైనా
ఎండమావేగా?
నిట్టాడు ఓటు లేకుండా
సర్కారు గుడిసె నిలుస్తుందా?
భిన్న భాషలు
భిన్న సంస్కృతులు
భిన్న జాతులైతే భిన్న పార్టీలుండవా?
రాజులు రాజరికాలు ఇంకానా?
సర్కారు మారడం దేశద్రోహమా?
సంధించే
సశాస్త్రీయ ప్రశ్నతో
దుష్ప్రచారానికి
చరమాంకం
సత్యాగ్రహ
ఉద్యమాచరణే
దుర్మార్గానికి
భరతవాక్యం.
- కె.శాంతారావు,
9959745723







కామెంట్లు (0)