దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం క్రమంగా విస్తరించింది. ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే పద్ధతి పెరిగింది. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతకు దూరమయ్యారు. తెలంగాణలో సుమారు ఐదు లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నప్పటికీ తక్కువ వేతనాలు పొందుతున్నారు. సంవత్సరాల తరబడి సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ప్రధాన డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కాదు, హక్కులు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి.కనీస వేతనాన్ని నెలకు రూ.42వేలకు పెంచాలి.డీఏ, హెచ్ఆర్ఏ తదితర భత్యాలు కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలి.మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, అంత్యక్రియలకు రూ.30 వేలివ్వాలి. పదవీ విరమణ సమయంలో రూ.16 లక్షల గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులకు, వారి కుటుం బాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలి.కారుణ్య నియామకాలు అమలు చేయాలి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని దయాదాక్షిణ్యాలు కోరడం లేదు. తమ శ్రమకు తగిన వేతనం, గౌరవం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతను హక్కుగా కోరుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మికుల జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- డి.జి. శ్రీనివాస్, 8341037165
శ్రమకు తగిన గౌరవమేదీ?
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)