Wednesday, April 30, 2025
Homeట్రెండింగ్ న్యూస్భూభారతి దేశానికి రోల్ మోడల్: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

భూభారతి దేశానికి రోల్ మోడల్: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

– కొత్త చట్టంతో భూ సమస్యలకు చెక్ 

– భూభారతి చట్టం అవగాహన సదస్సు

నవతెలంగాణ – బొమ్మలరామారం 

భూభారతి 2025 నూతన చట్టం ద్వారా భూ సమస్యలు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.బొమ్మలరామారం మండల కేంద్రంలో భూభారతి 2025 చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో సోమవారం రైతులకు భూభారతి చట్టం విధివిధానాల పై ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్టర్లను,మ్యూటేషన్, నిషేధిత భూములు,ఆర్ వో ఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. రైతులకు తమ భూముల విషయంలో ఉన్న ఆభద్రతకు తావు లేకుండా, జవాబుదారీతానాన్ని పెంచేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం హాయంలో ప్రతి దానికి ఫీజులు వసూలు చేసేవారన్నారు.భూభారతి ద్వారా ఒక రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.భూభారతి కింద భూములు వివరాలను డిజిటల్తెజేషన్ చేస్తామని,దీంతో భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు,వివాదాలు రావన్నారు.భూభారతి చట్టం దేశానికి రోల్డ్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు.ఈ పోస్టర్ పై ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని కోరారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి ధరణిలోని సమస్యలను తొలగించి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, దీని వలన ప్రతి ఒక్కరి భూ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని అన్నారు.ధరణిలో సమస్యలను, దాని వల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. బొమ్మలరామారం మండల రైతులు ఈ భూభారతి చట్టం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవం కలిగిన రిటైర్ ఉద్యోగులు,నిపుణులు ఎంతో మందితో చర్చించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందిందన్నారు.ధరణిలో రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారలు, హక్కులు లేకుండా,ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్లవలసి ఉండేదని, ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్లలేనందున అధిక సంఖ్యలో సమస్యలు మిగిలిపోయాయని కలెక్టరు తెలిపారు. కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూ భారతి చట్టంలో తహశీల్దారు స్థాయి నుండి సీసీఎల్ఎ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే వెసలుబాటు కల్పిస్తామన్నారు. ధరణిలో భూ కొనుగొలు, అమ్మకాలే కాకుండా భూరికార్డులలో పేర్ల మార్పులకు కూడా చాలా ఇబ్బంది కలిగిందని అన్నారు. ధరణిలో నష్టపోయినవారు ఇప్పటికి కొత మందికి న్యాయం జరగలేదని,భూ భారతి చట్టం ద్వారా భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.ఈ భూధార్ విజయవంతమైతే భవిష్యత్తు తరాలకు ఎలాంటి భూ ఆక్రమణ సమస్యలు ఉండబోవన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్ తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్, శ్రీను, సింగిల్ విండో చైర్మన్ బాల్ నరసింహ, మాజీ చైర్మన్ మోకు మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ధీరావత్ సునీత,తిరుమల కవిత, యంజాల కళ, పావని, నాయకులు చీర సత్యనారాయణ, మహేష్ గౌడ్, శ్రీహరి, నందరాజ్ గౌడ్, ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img