Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్పీకర్‌ను దూషించిన కేసు.. ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

స్పీకర్‌ను దూషించిన కేసు.. ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించిన కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిని అరెస్టు చేయొద్దంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్‌తో పాటు విధుల్లో ఉన్న పోలీసులపై కూడా దాడి చేశారని పీపీ నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎమ్మెల్సీలను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -