- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్ తో సంఘర్షణలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ న్యూయార్క్ వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మంగళవారం న్యూయార్క్ వెళ్లనున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఈ పర్యటన సందర్భంగా, పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని, అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధం విషయంలో ఇరాన్ వైఖరిని వివరిస్తారని పేర్కొంది.
- Advertisement -



