వరల్డ్ వైడ్‌గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈనెల 21న తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్‌కు వచ్చాను.
ఇప్పుడు ఒక పాస్టర్‌గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్‌కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా’ అని అన్నారు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, సిఎస్‌ఐ బిషప్ విల్సన్, డైరెక్టర్ వంశీకృష్ణ, నటుడు జక్కుల కృష్ణ మోహన్ తదితరులు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
123 అవార్డులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



