భిన్న కథ..

లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై సుడిగాలి సుధీర్‌, దివ్య భారతి జంటగా, ‘పాగల్‌’ ఫేమ్‌ దర్శకుడు నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో చంద్ర శేఖర్‌ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రాన్ని ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సుడిగాలి సుధీర్‌ బర్త్‌ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేసిందీ చిత్ర బృందం.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. సుడిగాలి సుధీర్‌ బర్త్‌ డే సందర్భంగా మా సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్‌ అందిస్తున్నారు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని అన్నారు. ‘ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అని దర్శకుడు అన్నారు.లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై సుడిగాలి సుధీర్‌, దివ్య భారతి జంటగా, ‘పాగల్‌’ ఫేమ్‌ దర్శకుడు నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో చంద్ర శేఖర్‌ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రాన్ని ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సుడిగాలి సుధీర్‌ బర్త్‌ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేసిందీ చిత్ర బృందం.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. సుడిగాలి సుధీర్‌ బర్త్‌ డే సందర్భంగా మా సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్‌ అందిస్తున్నారు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని అన్నారు. ‘ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అని దర్శకుడు అన్నారు.

Spread the love