Saturday, August 8, 2026
E-PAPER
Homeజిల్లాలుతెల్ల రేషన్ పై 14 రకాల సరుకులివ్వాలి: సీపీఐ(ఎం)

తెల్ల రేషన్ పై 14 రకాల సరుకులివ్వాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

 సీపీఐ(ఎం) మండల కార్యదర్శలు మల్లేష్, సైదులు 
నవతెలంగాణ-అచ్చంపేట
స్వాతంత్రం దినోత్సవం పురస్కరించుకొని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యంతో పాటు కందిపప్పు, చింతపండు, ఉల్లిగడ్డ, కారం పాకెట్, మంచి నూనె ప్యాకెట్ లాంటి 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీపీఐ(ఎం) అచ్చంపేట మండల కార్యదర్శి సైదులు, అమ్రాబాద్ మండల కార్యదర్శి మల్లేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ..అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు ఎక్కువగా ఉన్నారనీ, పెరిగిన ధరల రీత్యా నిత్యావసర సరుకులు కొనలేక, సరైన ఆహారం కూడా నోటికాడికి అందని పరిస్థితి నెలకొందని చెప్పారు.

నల్లమల అటవీ ప్రాంత గిరిజన తండాలు, చెంచు పెంటల్లో నివసిస్తున్న గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం అందక రక్తహీనతతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లలు తక్కువ బరువుతో బలహీనంగా పుడుతున్నారని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డుపై మనిషికి 6 కిలోల చొప్పున ఇస్తున్న సన్నబియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి ఆరోగ్యకరమైన రేపటి పౌరులను అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -