నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, ప్రత్తి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్తి పంటలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ, పచ్చదోమ, పెనుబంక, తామర పురుగులను గమనించామని చెప్పారు. దాని నివారణకు వేపనూనె ఒక ఎకరానికి (1500ppm) 500ml per acre + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు లేదా అసేటమిప్రిడ్ 50గ్రాములు ఎకరాకు లేదా Thiomethaxsam 50 గ్రాములు ఈ మందులలో ఏదో ఒక మందు మార్చి మార్చి పిచికారి చేసి నివారించవచ్చని పేర్కొన్నారు. అధిక తేమ వలన పారా విల్ట్ తెగులు వచ్చి మొక్కలు వడలు పోతే దాని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి 3గ్రాములు + 19.19.19 లీటరు నీటికి 100గ్రాములు కలిపి మొక్క బాగా తడిచేలా పిచికారి చేయాలని చెప్పారు.
సోయాబీన్ పంటలో కాండం తొలుచు పురుగు ( Stem girdle), పచ్చ పురుగు గమనించి దాని నివారకు వేపనూనె (1500ppm) 500ml per acre + ప్రొఫెనోఫోస్ 40EC @400ml ఎకరాకు లేదా Lamda chyalothrim 200ml ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు సోదరులు మైపూర్వర్ శంకర్ పాల్గొన్నారు.



