Saturday, August 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం

బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
బస్వాపూర్ గ్రామ పంచాయతీలో వాడవాడలా శనివారం ఆ గ్రామ సర్పంచ్ సర్పంచ్ రమణ సురేష్ గొండ కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఈ క్రమంలో 10 వార్డులో దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మరోవార్డులో దారివెంట వర్షపు నీళ్లు ఆగి బురదమయమైన చోట కూడా బ్లీచింగ్ పౌడర్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడడమే నాకు మహాభాగ్యమన్నారు. సర్పంచ్ పనితీరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్, వార్డు సభ్యులు శివాజీ పటేల్, గ్రామ పెద్దలు పి. రాజ్ పటేల్, ముంగేవారు దత్తారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది, వీరేశం, రాజు, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -