Friday, November 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపెరూలో బస్సు లోయలో పడి 37 మంది మృతి

పెరూలో బస్సు లోయలో పడి 37 మంది మృతి

- Advertisement -

లిమా : పెరూ దేశం అరెక్విపా పర్వత ప్రాంతంలో బస్సు లోయలో పడి 37 మంది ప్రయాణికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున మైనింగ్‌ జిల్లా నుండి అరెక్విపా వైపు 60 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సు 650 అడుగుల లోతులో పడిపోయింది. 37 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వారిని సమీప హాస్పటల్‌కు తరలించారు. డ్రైవర్‌ మద్యం సేవించడం, రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానిక అధికారులు తెలిపారు. అయితే సరైన రోడ్లు లేక, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం పెరూలో రోడ్డు ప్రమాదాల్లో 3వేలకు పైగా మరణించారని డెత్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సంస్థ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -