నవతెలంగాణ – మిర్యాలగూడ : పండ్లతోటల సాగుకు డ్రిప్ సేద్యానికి 90 శాతం సబ్సిడీ ఉద్యానవన శాఖ ఇవ్వనున్నట్టు ఆ శాఖ డివిజన్ అధికారి నసీమామెహరిన్ తెలిపారు. శనివారం మిర్యాలగూడ మండలంలోని నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థ క్షేత్రం, ఐలాపురం గ్రామాల్లో నిమ్మ తోట సాగుకు దరఖాస్తు చేసుకున్న వారి భూములను సాగుకు అనుకూలంగా ఉన్నావా లేవా అని పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నందిపాడు ఫారంలోని 2ఎకరాలలో, ఐలపురం గ్రామంలో గాదె వాగ్దేవి 6ఎకరాలలో నిమ్మతోట వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని ఆయా క్షేత్రల్లో భూముల సారం, నీటి లభ్యత పరిశీలించామన్నారు. పెట్లూరు మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలని కోరామన్నారు. ఎరువులు వాడే విధానం, మొక్కలు నాటే పద్ధతి రైతుకు వివరించామన్నారు. నందిపాడు సీడ్ ఫారంలో 20 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించ్చానని సలహాలు, సూచనలు చేశామన్నారు.అంతర పంటలు సాగు చేసుకోవాలని సలహా ఇచ్చినట్టు తెలిపారు.
డ్రిప్ సేద్యానికి 90 శాతం సబ్సిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



