నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివని, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ( అక్టోబర్ 21 st) ను పురష్కరించుకొని ఫ్లాగ్ డే ఈవెంట్స్ లో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్, బీచుపల్లి 10 వ బేటాలియన్ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన, బైక్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద, జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ లో భాగంగా జిల్లా ఎస్పీ కూడా స్వయంగా బైక్ నడిపి ఉత్సాహపరిచారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ .. ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రజలతో మరింత మమేకం అవుతూ, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
జిల్లా కేంద్రం లోని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ కలెక్టరేట్, ఫ్లైఓవర్, రాజీవ్ మార్గ్, YSR చౌక్, న్యూ బస్ స్టాండ్, కృష్ణవేణి చౌక్, అంబేద్కర్ చౌక్, ఫ్లైఓవర్ మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు నిర్వహించారు. 180 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ బైక్ ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్, బీచుపల్లి 10 వ బేటాలియన్ కమాoడెంట్ ఎస్. జె. జయరాజు, డి. ఎస్పీ మొగిలయ్య, సాయుధ దళ. డి.ఎస్పీ నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రవి, అలంపూర్, గద్వాల్, సి లు రవి బాబు, శ్రీనివాస్, ఆర్.ఐ. లు వెంకటేష్, హరీఫ్, బెటాలియన్ ఆర్.ఐ. లు ధర్మారావు, నర్సింహా రాజు, శ్రీనివాస్, రాజేషమ్, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.