Thursday, October 23, 2025
E-PAPER
Homeఖమ్మందురాలవాట్లకు యువత దూరంగా ఉండాలి..

దురాలవాట్లకు యువత దూరంగా ఉండాలి..

- Advertisement -

డ్రగ్స్ పై  చైతన్యం, కాలేజీలలో జనసంచారంలో విస్తృత ప్రచారం..
డీఎస్పీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – మణుగూరు
నేటి యువతీ, యువకులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని, ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ , వాట్సప్  పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మణుగూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి. బి రవీంద్రారెడ్డి యువతకు పిలుపునిచ్చారు. బుధవారం వివిధ కళాశాలలో బస్టాండ్ ల లో యువతకు అవగాహన చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, జీవితాన్ని విధ్వంసం చేసుకోవద్దని యువతను కోరారు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని యువతరానికి పిలుపునిచ్చారు.

మణుగూరు సబ్ డివిజన్ లో యువత,మత్తు వ్యసనాల చెర నుండి రక్షించి, చైతన్య వంతమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచతో జిల్లాఎస్పీ రోహిత్ రాజ్ తలపెట్టిన కార్యక్రమాన్ని  డీఎస్పీ రవీందర్ రెడ్డి ముందుకు ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో, కాలేజీల్లో ప్రధానంగా డ్రగ్స్ చైతన్యం పేరుతో ప్రజల్ని భాస్వామ్యం తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే నేడు మణుగూరు ఆర్.టి. సీ బస్ స్టాండ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నగేష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -