Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగుర్తుతెలియని మహిళ దారుణ హత్య

గుర్తుతెలియని మహిళ దారుణ హత్య

- Advertisement -

తల, కుడిచేయి మణికట్టు మాయం
నవీపేట్‌ మండలం మిట్టాపూర్‌ శివారులో ఘటన
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ


నవతెలంగాణ-నవీపేట్‌
గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం మిట్టాపూర్‌ శివారులో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మిట్టాపూర్‌ శివారులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్యతో పాటు ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ తిరుపతి చేరుకుని పరిశీలించారు. మృతదేహం నగంగా, తల లేకుండా కుడి చేయి మణికట్టు తొలగించి ఉంది. సీపీ సాయిచైతన్య పది స్పెషల్‌ టీంలను రంగంలోకి దించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం ఆధారంగా ఆధారాలు సేకరించారు. మండలంలో వరుస హత్యలు చోటు చేసుకుంటుండడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -