- Advertisement -
నవతెలంగాణ-చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ప్రమాదానికి గురైన బస్సు ఆర్టీసీ హైర్ వెహికల్ (అద్దె)గా గుర్తించారు. డ్రైవర్ పేరు దస్తగిరి బాబా అని పోలీసులు వెల్లడించారు. బస్సు నంబర్ TG 34TA 6534. ఈ తెల్లవారుజామున 4.40 గం.కు బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయల్దేరింది. ఉదయం 6.15 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమె ఎడమవైపు కూర్చోవడం వల్లే ప్రాణాలు దక్కినట్లు తెలుస్తోంది.
- Advertisement -



