కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘ఆడుకున్న దిక్కడే’ను దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ‘ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’అని తెలిపారు. హీరో దినేష్ కుమార్, హీరోయిన్‌గా పరిచయమవుతున్న దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మూడో పాటగా’ఆడుకున్నదిక్కడే’ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



