నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మిరెడ్డి తెలిపారు. మంగళవారం గద్వాల పట్టణం పాత హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.చక్రధర్ కోశాధికారి బీసిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధనకై నవంబర్ 7న భారీ నిరసన దీక్ష చేపట్టినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బెనిఫిట్ లను వెంటనే విడుదల చేయాలని, ఓపీతో పాటు, నగదు రహిత వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న ఛలో హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలతో పాటు,ఆర్థిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలని, రెండేళ్లుగా అమలుకు నోచుకోని పీఆర్సీని ఖరారు చేసి తమను ఆదుకోవాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. చలో హైదరబాద్ నిరసన దీక్షకు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎం.కృష్ణారెడ్డి, వీర వసంత రాయుడు, యు.సత్యనారాయణ, ఎన్.నరసింహులు, పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.



