Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅభయుడి సన్నిధిలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు..

అభయుడి సన్నిధిలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ : నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బరి ఆంజనేయస్వామి దేవాలయంలో నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ అమరేందర్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మండల పరిధిలోని ఊరుకొండ పేట అభయాంజనేయ స్వామి దేవాలయంలో జాయింట్ కలెక్టర్ అమరేందర్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మారుతి, దేవాలయ కమిటీ సభ్యులు దారా బంగారయ్య, అర్చకులు, భక్తులు, యాత్రికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -